Home > ఆంధ్రప్రదేశ్ > Supreme Court : రుషికొండపై జోక్యం చేసుకోలేం.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం

Supreme Court : రుషికొండపై జోక్యం చేసుకోలేం.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం

Supreme Court : రుషికొండపై జోక్యం చేసుకోలేం.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం
X

విశాఖలోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. కాగా, రుషికొండలో అక్రమ నిర్మాణాలు, సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు వ్యతిరేకంగా విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/ఎ కింద ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని శివరామప్రసాద్ ఆ పిటిషన్ లో కోరారు. రుషికొండపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్ లో శివరామప్రసాద్ కోరారు.

ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పెండింగ్ ఉన్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది. 'సీఎంను రుషికొండకు వెళ్లొద్దంటారా.?' ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది.? అంటూ పిటిషనర్ ను సీజే ప్రశ్నించారు. లింగమనేని అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.




Updated : 3 Nov 2023 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top