Home > ఆంధ్రప్రదేశ్ > పోలీస్‌స్టేషన్‌లో దొంగలు....ఇదో వెరైటీ చోరీ..!

పోలీస్‌స్టేషన్‌లో దొంగలు....ఇదో వెరైటీ చోరీ..!

పోలీస్‌స్టేషన్‌లో దొంగలు....ఇదో వెరైటీ చోరీ..!
X

మన ఇంట్లో దొంగలు పడినా, మన వస్తువులు చోరీకి గురైన పోలీస్ స్టేషన్ కు పరుగులు తీస్తాం. దొంగతనంపై ఫిర్యాదు చేస్తాం. అనంతరం పోలీసులు తమ పనిని మొదలు పెడతారు. తమదైన స్టైల్ లో విచారణ జరిపి దొంగలను పట్టుకుంటారు. మరి అట్లాంటి పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగితే, పోలీస్ స్టేషన్ లో వస్తువులే చోరికి గురైతే..వినడానికి కొంచెం వింతగా ఉంది కదా..

కర్నూలు జిల్లాలో ఇదే జరిగింది. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ వింత దొంగతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ కేసులో అరెస్టైన దొంగ వస్తువులే దొంగతనానికి గురయ్యాయి.

పూర్తి వివరాలు చూస్తే కర్నూలు జిల్లాలోని కౌతాళం పోలీసులు..కోసిగికి చెందిన కటిక షబ్బీర్‌తో పాటు మరో ఇద్దరిని చోరీ కేసులో జూన్ 26వ తేదీన అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎల్‌ఈడీ టీవీ, ఎలక్ట్రికల్ సామాన్లు, హొండా యూనిక్రాన్ బైక్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. అయితే బైక్ టైర్లు, సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు మార్చి వేరేవి అమర్చడం కలకలం రేపుతోంది. ఇది గమనించిన బాధితుడు.. పోలీస్ స్టేషన్‌లో రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నాడు. పోలీసులకు తెలియకుండా ఎవరు మారుస్తారని ప్రశ్నిస్తున్నాడు.అయితే ఈ విచిత్ర దొంగతనం గురించి విని పోలీస్ ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనిపై అంతర్గతంగా విచారణ జరిపి ఇంటి దొంగలా, బయట దొంగలా అని తేల్చే పనిలో పడ్డారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు.


Updated : 8 Aug 2023 11:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top