Home > ఆంధ్రప్రదేశ్ > ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు.. ఏపీలో భారీగా ఉద్యోగాల బదిలీ

ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు.. ఏపీలో భారీగా ఉద్యోగాల బదిలీ

ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు.. ఏపీలో భారీగా ఉద్యోగాల బదిలీ
X

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అధికారం చేపట్టడమే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలను రచిస్తూ ఎన్నికల కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల విధులతో సంబంధమున్న అధికారులు, సిబ్బంది బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఒకే చోటు మూడేళ్ల కంటే ఎక్కువ రోజులు సర్వీస్ చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు, ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, జూన్ 30 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి అవుతున్న వారిని బదిలీ చేయనున్నారు. దీనిపై ఆయా విభాగాల అధిపతులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎలక్షన్ డ్యూటీలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారు, అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్ లో లేని అధికారులను పరిగణంలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒకే జిల్లాలో పదోన్నతి పొందినా.. అంతకుముందు చేసిన సర్వీసును కూడా పరిగణంలోకి తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖలో 92 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలోనూ భారీగా ఉద్యోగాలు బదిలీ అయ్యాయి.

Updated : 27 Jan 2024 7:01 AM IST
Tags:    
Next Story
Share it
Top