వారికి ఉన్నంత రెమ్యునరేషన్ నాకు లేదు..నాకు ఎలాంటి ఇగో లేదు..పవన్ కల్యాణ్
X
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది హీరోలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్, ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కొంత మంది స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ తనకు లేదని , ప్రపంచవ్యాప్తంగా వారు తెలిసినంతగా నేను తెలియదని, వారికి ఉన్నంత రెమ్యునరేషన్ కూడా తనకు లేదని పవన్ ఈ సభలో అన్నారు. అదే విధంగా కథానాయకుల ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సభలో పవన్ మాట్లాడుతూ.." చాలా మంది నన్ను అడుగుతుంటారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవపడుతుంటారని. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, సంతోషం. నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. నాకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా ప్రతి ఒక్కరిపై ఎంతో గౌరవం ఉంది. వారి సినిమాలను నేను తప్పకుండా చూస్తాను. ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మేము బాగానే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా ఉన్న మీ హీరోల మీద ఇష్టాన్నిరాజకీయాల్లో అస్సలు చూపించకండి. నిజం చెప్పాలంటే ప్రభాస్, మహేశ్‌బాబులు నాకంటే బిగ్ స్టార్స్. పాన్ ఇండియన్ స్టార్స్‌గా వారు నాకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక చరణ్, ఎన్టీఆర్ అయితే గ్లోబల్ స్థాయికి వెళ్లారు. వీరంతా తెలిసినంతగా పవన్ ప్రపంచానికి తెలియదు. ఈ విషయంలో నాకు ఎలాంటి ఇగో లేదు. హీరోలను అభిమానించండి, కానీ వారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకండి. ఇదే నా విజ్ఞప్తి. అన్యాయంపై పోరాటం చేసేవాళ్లు ఈ సమాజానికి కావాలి. అందుకు నేను ఒక్కడినే సరిపోను. ప్రశ్నించే గొంతుకలు కావాలి. ఆడ పడుచులు, యువత కావాలి" అని అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.