Home > ఆంధ్రప్రదేశ్ > NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాల యువకులు

NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాల యువకులు

NIA మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాల యువకులు
X

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఈ సంస్థలో సంబంధాలు ఉన్న వ్యక్తుల కోసం వేటాడుతోంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో... తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్, ఏపీలోని నెల్లూరు జిల్లా ఖాజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ పేర్లను ఎన్ఐఏ చేర్చింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల వారితో పాటు 11 మంది కేరళ, ఐదుగురు కర్ణాటక వాసులు ఉన్నారు. నిందితుల ఆచూకీ తెలిస్తే 9497715294కు సమాచారం ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.

పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తుండటంతో గతేడాది సెప్టెంబర్ నెలలో ఎన్ఐఏ, ఈడీలు ఏకకాలంలో ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని 100కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లురులో దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురితో పాటు కేరళలో 11 మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళనాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది ఎన్ఐఏ.




Updated : 17 Dec 2023 5:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top