Home > ఆంధ్రప్రదేశ్ > దేశంలో మూడో పెద్దపార్టీగా వైకాపా.. టైమ్స్ నౌ సర్వే అంచనా

దేశంలో మూడో పెద్దపార్టీగా వైకాపా.. టైమ్స్ నౌ సర్వే అంచనా

దేశంలో మూడో పెద్దపార్టీగా వైకాపా.. టైమ్స్ నౌ సర్వే అంచనా
X

పార్లమెంటు ఎన్నికలకు ఇంకా పది నెలల గడువుండగానే దేశప్రజల నాడిపై అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ గాలి వీస్తుందని టైమ్స్ నౌ – నవభారత్ సర్వే తెలిపింది. ‘జన్ గన్ కామన్’ పేరుతో జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని సర్వే అంచనా. అలాగే వైకాపా ఏపీలో దాదాపు అన్ని సీట్లు కొట్లగొట్టి దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని పేర్కొంది.





సర్వే ప్రకారం.. మొత్తం 543 లోక్ సభ సీట్లకు గాను బీజేపీకి 285- 325 వరకు సీట్లు రావొచ్చు. ఈసారి కూడా ఒంటిచేత్తోనే మోదీ ప్రధాని అయ్యే చాన్సుంది. 300లకుపైగా సీట్లతో అఖండ మెజారిటీ సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ మళ్లీ దేశంలో రెండో అతిపెద్దగా పార్టీగా అవతరిస్తుందని, దానికి 111-149 సీట్లు రావొచ్చుని సర్వే పేర్కొంది. ఏపీ అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలకుగాను 24- 25 సీట్లు 37 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 17 స్థానాలకు గాను 9 నుంచి 11 లోపు దక్కే అవకాశముంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 22 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 7 వరకు రావొచ్చు.


Updated : 1 July 2023 4:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top