కన్నుల పండువగా సాగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Kiran | 16 Oct 2023 10:27 PM IST
X
X
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో హంసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. హంస వాహనసేవలో మలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశించాడు. వాహనసేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్ స్వామితో పాటు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.
Updated : 16 Oct 2023 10:27 PM IST
Tags: andhrapradesh tirumala tirupati ttd tirumala tirupati devasthanam srivaru saraswathi alankaram hamsa vahanam sri malayappa swamy chinna sheshavahanam simha vahanam mutyapu pandiri
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire