Home > ఆంధ్రప్రదేశ్ > ప్రయాణికులకు అలర్ట్..నెల రోజులు ఈ రైలు సేవలు బంద్

ప్రయాణికులకు అలర్ట్..నెల రోజులు ఈ రైలు సేవలు బంద్

ప్రయాణికులకు అలర్ట్..నెల రోజులు ఈ రైలు సేవలు బంద్
X

ఒడిశా రైలు ప్రమాదం అనంతరం పలు ప్రాంతాల్లో తరచుగా జరుగుతున్న రైలు ప్రమాదాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమైంది. పలు జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపడుతోంది. తాజాగా తిరుపతి రైల్వే జంక్షన్‌లోనూ అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది.ఈ నేపథ్యంలో తిరుమల ఎక్స్‎ప్రెస్ రాకపోకల్లో భారీ మార్పులు చేసినట్లు ప్రయాణికులను అలర్ట్ చేసింది.

సాధారణంగా తిరుమల ఎక్స్‎ప్రెస్ ఇప్పటివరకు విశాఖ నుంచి రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుని .. ఆ తర్వాత కడపకు వెళ్లేది. అయితే తిరుపతి రైల్వే జంక్షన్‌లో మరమ్మత్తుల కారణంగా ఇకపై నెల రోజుల పాటు ఈ రైలు షెడ్యూల్‌ మారనుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఓ నెల పాటు షెడ్యూల్‎లో మార్పులు ఉంటాయని తెలిపింది. జూలై 11 నుంచి స్టార్ట్ అయిన ఈ మార్పులు ఆగష్టు 10వ తారీఖు వరకు కొనసాగనున్నాయి. ఈ నెల పాటు తిరుమల ఎక్స్‌ప్రెస్ సేవలు తిరుపతి, కడప స్టేషన్లకు పాక్షికంగా నిలవనున్నాయి.

కడప నుంచి రేణిగుంట మీదుగా విశాఖపట్నానికి వెళ్లే ప్రయాణికుల కోసం తిరుమల ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. అయితే షెడ్యూల్‎లో మార్పుల కారణంగా కడప-విశాఖపట్టణం (17487), విశాఖపట్టణం-కడప (17488) వెళ్లే రైలు ఆయా తేదీల మధ్యలో విశాఖ-రేణిగుంట.. తిరిగి అక్కడి నుంచే విశాఖకు రాకపోకలు సాగిస్తుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ భారీ మార్పుల వల్ల తిరుపతికి వచ్చి వెళ్ళే భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated : 14 July 2023 1:01 PM IST
Tags:    
Next Story
Share it
Top