Sri Vari Arjitha Seva Tickets : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం
X
శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించిన ప్రక్రియను జూన్ 19 ఉదయం ప్రారంభించింది. సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. లక్కీడిప్ నిర్వహించి భక్తులకు టికెట్లు కేటాయించనున్నారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవాలి.
కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవకు సంబంధించిన టికెట్లను టీటీడీ జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలలో కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాకు సంబంధించిన దర్శన టికెట్ల జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటా ఈ నెల 23న 10 గంటలకు విడుదల కానుంది. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మరోవైపు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. రూ.300 టికెట్లను ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు, వసతి గదులను బుక్ చేసుకునేందుకు ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు అనుమతిస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ ప్రకటించింది.