Home > ఆంధ్రప్రదేశ్ > ఇవాళ్టి నుంచి తిరుమలలో పుష్కరిణి బంద్.. కారణమిదే..?

ఇవాళ్టి నుంచి తిరుమలలో పుష్కరిణి బంద్.. కారణమిదే..?

ఇవాళ్టి నుంచి తిరుమలలో పుష్కరిణి బంద్.. కారణమిదే..?
X

ఇవాళ్టి నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం వద్ద ఉన్న పుష్క‌రిణి మూతపడనుంది. నెల రోజుల పాటు దీనిని మూసివేయనున్నారు. పుష్కరణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు ఇవాళ్టి నుంచి 31 వరకు పుష్క‌రిణిని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దని చెప్పారు.

సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. అయితే సెప్టెంబర్లో శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల నేపథ్యంలో పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి మ‌ర‌మ్మ‌తులు చేయనున్నారు.

మరోవైపు శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 65,601 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న 5.21 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అధికమాసం సందర్భంగా ఈ సారి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని టీటీడీ వివరించింది.

Updated : 1 Aug 2023 9:24 AM IST
Tags:    
Next Story
Share it
Top