శ్రీవారి నడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త
X
శ్రీవారి నడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడకదారిన వెళ్లే భక్తులు సులభతరంగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో భక్తుల లగేజ్ భద్రపరిచే ప్రాంతాల్లో టోకెన్ ఇచ్చే విధానానికి టీటీడీ స్వస్తి పలికింది. అదే స్థానంలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా వీలైనంత త్వరగా భక్తుల లగేజ్ బ్యాగులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
నడిచే వెళ్లే భక్తుల లగేజీని టీటీడీ ఉచితంగా తరలిస్తోంది. గతంలో లగేజీ తరలింపు..తిరిగి అప్పగించడం మాన్యువల్ పద్దతిలో నిర్వహించేవారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, ట్రాక్ ఐడీ విధానంతో సాఫ్ట్వేర్ రూపొందించారు. దీని ద్వారా భక్తులు , సెల్ ఫోన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దాతల సహకారంతో ఈ పద్దతిని అమలు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
హార్డ్వేర్ కు సంబంధించి క్రిస్టియన్ భక్తుడైన చార్లస్ 2 కోట్లు విరాళంగా అందించారన్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో 44 కౌంటర్లలో.. 300 మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. . భక్తులు ఈ నూతన విధానం గురించి తెలుసుకోవాలన్నారు.ఇప్పటికే సిబ్బందికి నూతన విధానంపై శిక్షణ ఇచ్చామన్నారు