Home > ఆంధ్రప్రదేశ్ > Tirupati : ఈ నెల 24 నుంచి తిరుపతి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

Tirupati : ఈ నెల 24 నుంచి తిరుపతి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

Tirupati : ఈ నెల 24 నుంచి తిరుపతి ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
X

ఈ నెల 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర పెద్ద ఎత్తున సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరం ఫిబ్రవరి 24, శనివారం నాడు తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణ అభివృద్ధికి నాంది పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు.

ఇందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులుదొరికాయి. ఈ ఆధారాలు తిరుమల తిరుపతి ఆధ్వర్యంలోని గోవిందరాజ ఆలయంలో వెలుగులోకి వచ్చాయి. రామానుజాచార్యులవారి రాకకు ముందు తిరుపతి, తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. పండగల కోసం అనేక ప్రాంతాలున్నాయి. ఒక్కో ప్రాంతానిది ఒక్కో విశిష్టత. కానీ నగర స్థాపనకు కచ్చితమైన తేదీ ఉన్నది ఒక్క తిరుపతికే భగవద్ రామానుజాచార్యులవారే తిరుపతి నగరానికి మూలకర్త. అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరు రామానుజపురం అని పేరు పెట్టారు. చాలాకాలం రామానుజపురంగా పిలిచేవారు. అంతకుముందు గోవిందరాజ పట్టణం అని, తర్వాత రామానుజపురం అని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతి అని పిలిచేవారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు. అందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులు దొరికాయి.

Updated : 18 Feb 2024 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top