Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన

టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన

టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భూమన
X

టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈవో ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఛైర్మన్ గా నియమించినందుకు నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు భూమన. టీటీడీ ఛైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.





ఉదయం 9 గంటలకు పద్మావతి పురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.భూమనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. గతంలో 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా భూమన పనిచేశారు భూమన. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డిది ఈ నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ప్రస్తుత చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్‌తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఇంకో వారం రోజుల్లో ముగియనుంది.

అయితే, వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉంది. కానీ, వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి పదవిని ఏపీ ప్రభుత్వం కొనసాగించింది. టీటీడీ ఛైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ పోస్ట్ కాపులకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది. కానీ సీఎం జగన్ మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా నియమితలయ్యారు.







Updated : 10 Aug 2023 12:54 PM IST
Tags:    
Next Story
Share it
Top