Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu Arrest: చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం దారుణం..రవిబాబు

Chandrababu Arrest: చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం దారుణం..రవిబాబు

Chandrababu Arrest: చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం దారుణం..రవిబాబు
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే. బాబు అరెస్టుపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు.. సినీ సెలబ్రిటీలు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాబుకు మద్దతు తెలిపారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు బాబు అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ 73ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి ఇలా టార్చర్ పెట్టడం దారుణం అని తన అభిప్రాయాన్ని తెలిపారు. తమ అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబును ఏ విధంగా జైల్లో పెట్టారో...అదే అధికారాన్ని ఉపయోగించి ఆయన్ని బయటకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రవిబాబు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

" మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినీ సెలబ్రిటీల గ్లామర్, పొలిటీషియన్స్ పవర్ ఎప్పటికీ శాశ్వతం కాదు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు శాశ్వతంగా ఉండవు. రామారావుగారి, చంద్రబాబు గారి కుటుంబానికి, మా కుటుంబానికి దగ్గరి ఆప్తులు. చంద్రబాబు గారు ఏదైనా పని చేసే ముందు వందసార్లు ఆలోచిస్తారు. ఆ విషయం గురించి అందరితో చర్చిస్తారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారు. భూమి మీద ఆయనకు ఇవాళే చివరి రోజు అని తెలిస్తే.. వచ్చే 50ఏళ్లకు సంబంధించిన సామాజిక అభివృద్ధి గురించి వ్యూహాలను రచిస్తారు. అలాంటి వ్యక్తిని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా జైల్లో పెట్టి ఎందుకు హింసిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. ఇది చాలా దారుణమైన విషయం. టెంపొరరీ పవర్ ఉన్న వారికి నా హంబుల్ రిక్వెస్ట్.. మీరు ఏ అధికారాన్ని వినియోగించి చంద్రబాబును జైల్లో పెట్టారో, అదే అధికారాన్ని వాడి బాబును బయటకు తీసుకురండి. మీరు చిటికేస్తే అంతా జరిగిపోతుంది. ఆయన బయటకు వచ్చాక విచారణ చేసుకోండి. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలో మీరే ఆలోచించండి . కక్షతో రగిలిపోయే కసాయి వారిలానా, లేదా ప్రేమ, జాలితో ఉండే మంచి నాయకుడిగానా"అని బాబు అరెస్టుపై రవిబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Updated : 30 Sept 2023 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top