Home > ఆంధ్రప్రదేశ్ > ఈ రోజుల్లో నేరుగా శ్రీవారి దర్శనం.. నో వెయిటింగ్.. బ్రహ్మోత్సవాల్లో రథంపై..

ఈ రోజుల్లో నేరుగా శ్రీవారి దర్శనం.. నో వెయిటింగ్.. బ్రహ్మోత్సవాల్లో రథంపై..

ఈ రోజుల్లో నేరుగా శ్రీవారి దర్శనం.. నో వెయిటింగ్.. బ్రహ్మోత్సవాల్లో రథంపై..
X

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఈ ఏడాది అధికమాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వాటి తేదీని ఖరారు చేసింది టీటీడి. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు ప్రతి ఏడు నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడి ప్రకటించింది. తేదీల వారీగా బ్రహ్మొత్సవాల తేదీలు..





సాలకట్ల బ్రహ్మోత్సవాలు:

సెప్టెంబర్ 18- ధ్వజారోహణం

సెప్టెంబర్ 22- గరుడ వాహన సేవ

సెప్టెంబర్ 23- స్వర్ణ రథం

సెప్టెంబర్ 25- రథోత్సవం (మహారథం)

సెప్టెంబర్ 26- చక్రస్నానం, ధ్వజావరోహణం

నవరాత్రి బ్రహ్మోత్సవాలు:

అక్టోబర్ 19- గరుడవాహన సేవ

అక్టోబర్ 22- స్వర్ణరథం

అక్టోబర్ 23- చక్రస్నానం

కాగా, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పలు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడి ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు అష్టాదశ పాదపద్మారాధన, తిరుప్పావడై, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలనను రద్దు చేస్తున్నారు. ముందుగా అర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబర్ 14న సహస్రదీపాలంకార సేవను కూడా రద్దు చేస్తున్నారు.




Updated : 21 Aug 2023 5:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top