Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 19 నుంచి ఆర్జిత సేవ టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 19 నుంచి ఆర్జిత సేవ టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 19 నుంచి ఆర్జిత సేవ టికెట్లు విడుదల
X

తిరుమల వేంకటేశ్వరుడి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల సెప్టెంబర్ నెల కోటా షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 19న ఈ టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ కోసం జూన్‌ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తులు సొమ్ము చెల్లించి టికెట్‌ను కన్ఫామ్ చేసుకోవాలని టీటీడీ చెప్పింది.

మరోవైపు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్‌ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. సెప్టెంబరు నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్‌ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల జూన్‌ 22న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్లను 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.inలో లాగినై టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ చెప్పింది. వెబ్ సైట్తో పాటు యాప్లోనూ టికెట్లను పొందవచ్చు. యాత్రికులు అన్ని విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.




Updated : 17 Jun 2023 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top