Home > ఆంధ్రప్రదేశ్ > భక్తులకు కర్రల పంపిణీపై విమర్శలు..స్పందించిన టీటీడీ చైర్మన్

భక్తులకు కర్రల పంపిణీపై విమర్శలు..స్పందించిన టీటీడీ చైర్మన్

భక్తులకు కర్రల పంపిణీపై విమర్శలు..స్పందించిన టీటీడీ చైర్మన్
X

తిరుమల అలిపిరి నడకమార్గంలో ఇటీవల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిసేసిన సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనం కోసం మెట్లదారలో నడిచి వెళ్తున్న చిన్నారిని చిరుత చంపేయడం తీవ్ర విషాదాన్ని నింపింది. మెట్ల మార్గంలో భక్తులు వెళ్లేందుకు కూడా తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగా భక్తుల రక్షణకు కీలక చర్యలు చేపట్టింది.





మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను అనుమతి నిరాకరించారు. అదే విధంగా నడకమార్గాల్లో భక్తులను గుంపులుగా వెళ్లాలని సూచించారు. వారికి రక్షణగా సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. వీటితో పాటు భక్తుల భద్రత కోసం... నడకదారిలో వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కర్రే మొదటి ఆయుధమని టీటీడీ చైర్మన్ భూమన స్పష్టం చేశారు.





అయితే భక్తుల రక్షణకు టీటీడీ చేతికర్ర ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు సైతం ఎగతాలి చేయడంతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. దీనిపై చైర్మన్ భూమన కరుణాకర్‌‌రెడ్డి స్పందించారు. విమర్శలను ఆయన ఖండించారు. అటవీ శాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కర్రలు ఇచ్చి, బాధ్యతల నుంచి టీటీడీ తప్పుకుంటున్నదని ట్రోల్స్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు





తిరుమల నడకదారిలోని ఏర్పాటు చేసిన బోనులో గురువారం మరో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత చిక్కినట్లు అధికారులు టీటీడీ అధికారులు వెల్లడించారు. చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని వెల్లడించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు బోనులో చిక్కాయి.


Updated : 17 Aug 2023 8:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top