Tirupati : శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారిన టీటీడీ వెబ్సైట్
X
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ పేరు మారింది. ఇప్పటివరకు thirupathibalaji.ap.gov.in అని ఉండగా.. దానిని ttdevasthanams.ap.gov.in అని మార్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వన్ ఆర్గనైజేషన్..వన్ వెబ్‌సైట్..వన్ మొబైల్ యాప్‌లో భాగంగా బుకింగ్ వెబ్‌సైట్‌ను మార్చామన్నారు. దీంతో శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయని చెప్పారు. భక్తులు ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని అధికారులు సూచించారు.
టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, రవాణా సహా ఇతర వివరాలను కొత్త వెబ్సెట్ పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సహకారంతో టీటీడీ ఈ వెబ్‌సైట్‌ను డెవలప్ చేసింది. మరోవైపు ఈ నెల 16న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. 16న పార్వేట, గోదాపరిణయోత్సం కారణంగా స్వామివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సంక్రాంతిని పురస్కరించుకొని తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం నిర్వహించనున్నారు.