Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపట్నుంచి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపట్నుంచి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపట్నుంచి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్
X

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెల‌కు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 20న ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. 22న మధ్యాహ్నం 12 గంటల్లోగా నిర్ణీత రుసుము చెల్లించాలని స్పష్టం చేసింది.

కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను 21న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ చెప్పింది. ఇక వర్చువల్‌ సేవా టికెట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఇక శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, వసతి గదుల టికెట్లను 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను అక్టోబర్‌ 23 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తెస్తారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 24 ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్‌ను 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. 27న ఉదయం 10 గంటలకు తిరుపతికి చెందిన శ్రీవారి కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటా, 3 గంటలకు పరాకామణి సేవ కోటా టికెట్లను విడుదల చేస్తారు. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగినై భక్తులు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.




Updated : 17 Oct 2023 3:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top