Home > ఆంధ్రప్రదేశ్ > టీటీడీ అలర్ట్.. డిసెంబర్ నెల టికెట్ల కోటా రిలీజ్ డేట్ మార్పు..

టీటీడీ అలర్ట్.. డిసెంబర్ నెల టికెట్ల కోటా రిలీజ్ డేట్ మార్పు..

టీటీడీ అలర్ట్.. డిసెంబర్ నెల టికెట్ల కోటా రిలీజ్ డేట్ మార్పు..
X

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీ ఫిక్స్ చేసింది. రూ.300 స్పెషల్ దర్శనం టికెట్ల కోటాను సెప్టెంబర్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ నెల 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా.. టీటీడీ అధికారులు సోమవారానికి వాయిదా వేశారు. ఇక తిరుమలలో డిసెంబర్ నెల వసతి గదుల కోటాను 27న రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారిని బంగారు తేరుపై ఊరేగించారు. ఇవాళ ఉదయం హనుమంత వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రికి గజవాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామివారు.

Updated : 24 Sept 2023 12:17 PM IST
Tags:    
Next Story
Share it
Top