Home > ఆంధ్రప్రదేశ్ > TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల టికెట్ల విడుదల తేదీలు ఇవే

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల టికెట్ల విడుదల తేదీలు ఇవే

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల టికెట్ల విడుదల తేదీలు ఇవే
X

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. 2024 జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 18 ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. లక్కీడిప్ కోసం ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పింది. ఊంజల్‌ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 21న ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

రూ.500, రూ.1000 వర్చువల్ సేవా టికెట్లు అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పింది. జనవరి నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టిక్కెట్లు 23న ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ (బ్రేక్ దర్శనం) టికెట్లు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. 24 ఉదయం 11 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక జనవరి నెలకు సంబంధించిన వసతి గదుల బుకింగ్ కోసం ఈ నెల 25 ఉదయం 10 గంటలకు స్లాట్‌లు విడుదల చేయనున్నారు. 25న తిరుపతి, 26న తిరుమలలోని రూంల స్లాట్లు రిలీజ్ కానున్నాయి.

Updated : 11 Oct 2023 2:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top