Home > ఆంధ్రప్రదేశ్ > భక్తులకు అలర్ట్.. రేపు అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

భక్తులకు అలర్ట్.. రేపు అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

భక్తులకు అలర్ట్.. రేపు అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల
X

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి. అంగ ప్రదక్షణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లను కూడా రిలీజ్ చేయనున్నారు. దివ్యాంగులు, వృద్ధుల దర్శన టికెట్లు కూడా సోమవారమే విడుదల చేయనున్నారు.

అక్టోబర్‌ నెలకు సంబంధించి రోజుకి 15 వేల చొప్పున టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై 25 మంగళవారం రోజున అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4వేల చొప్పున అదనపు కోటా టికెట్లు అందుబాటులోకి తేనున్నారు. గదులకు సంబంధించిన వివరాలను సైతం జులై 26 ఉదయం 10 గంటలకు వెల్లడించనున్నారు. తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబర్ నెలకు సంబంధించి గదుల సమాచారం అందుబాటులో ఉంచనున్నారు.




Updated : 23 July 2023 8:45 PM IST
Tags:    
Next Story
Share it
Top