Home > ఆంధ్రప్రదేశ్ > ఊహకందని విషాదం.. కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి

ఊహకందని విషాదం.. కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి

ఊహకందని విషాదం.. కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి
X

బంధువుల ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ కోసం విశాఖపట్నం నుంచి ఓ వచ్చిన వ్యక్తి అనుకోని ప్రమాదంలో తన ఇద్దరు కొడుకులని కోల్పోయాడు. సమీపంలోనే ఉన్న తోడల్లుడి కుమారుడిని కాపాడాడు కానీ సొంత కుమారులను రక్షించుకోలేకపోయాడు. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ పట్టణం ఎన్‌ఏడీ జంక్షన్‌లో జ్యోతి,ఆనంద్ దంపతులు నివసిస్తున్నారు. 11 ఏళ్ల కార్తికేయ, 7 ఏళ్ల గణేష్‌ గౌతమ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జ్యోతి చెల్లెలు శ్రీకాకుళంలో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తె జస్సిక పుట్టిన రోజు వేడుకల నిమిత్తం.. ఆనంద్ తన కుటుంబంతో సహ మూడు రోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లారు.





బుధవారం ఉదయం సరదాగా తన కుమారులిద్దరినీ, అలాగే తోడళ్లుడి కొడుకైన వర్షిత్ ను తీసుకొని దగ్గరలో ఉన్న నాగావళి నదికి బయలుదేరారు ఆనంద్. అక్కడికి వెళ్లిన తరువాత ముగ్గురు పిల్లలు నదిలో స్నానం చేస్తామని అన్నారు. ముగ్గురు నదిలో దిగి సరదాగా ఈత కొడుతూ, స్నానం చేస్తున్నారు. అయితే వీరు ఈత కొడుతున్న ప్రదేశంలో ఇసుక తవ్వకాల కోసం తీసిని భారీ గొయ్యి ఉంది. దీనిని గమనించగా ముగ్గురు పిల్లలు అక్కడికి వెళ్లడంతో, నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన ఆనంద్ ఒక్క సారిగా అప్రమత్తమయ్యారు.వెంటనే వర్షిత్ ను రక్షించారు. కానీ తన కుమారులిద్దరినీ కాపాడుకోలేకపోయారు.

వారిద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంత సమయం తరువాత రేవు వద్ద వీరిద్దరూ కనిపించారు. స్థానికులు వారిని గమనించారు. అప్పటికి చిన్నారులిద్దరూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే వారిద్దరూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఇద్దరు కుమారులు ఒక్కసారిగా మృత్యువు పాలు కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రి కి పోస్టుమార్టంకు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Updated : 17 Aug 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top