Home > ఆంధ్రప్రదేశ్ > Andhra Pradesh : మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ మహిళా వాలంటీర్

Andhra Pradesh : మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ మహిళా వాలంటీర్

Andhra Pradesh : మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ మహిళా వాలంటీర్
X

వైసిపి సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థ ఇటీవల వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. హత్యలు , అత్యాచారాలు , దొంగతనాలు చేస్తున్నారంటూ.. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లపై ఆరోపణలు చేస్తుండగా.. తాజా ఘటనలు అవి నిజమేనన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. తాజాగా ఇద్దరు వాలంటీర్లు కర్ణాటక నుండి ఏపీకి అక్రమంగా మద్యం తరలించి అమ్ముకుంటూ వాలంటీర్లు పట్టుబడ్డారు. వీరిలో ఓ మహిళా వాలంటీర్ కూడా వుండటం సంచలనంగా మారింది.

పక్క రాష్ట్రలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం ధరలు కాస్త తక్కువగా వుండటంతో ఏపీకి చెందిన కొందరు దీన్ని ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఈ రాష్ట్రాల మద్యం అక్రమంగా ఏపీకి తరలించి గుట్టుగా విక్రయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో మదనపల్లె స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో రంగంలోకి దిగింది. కురబలకోట అంగళ్లులో తనిఖీలు నిర్వహించగా కర్ణాటక మద్యంతో వాలంటీర్లు పట్టుబడ్డారు.





అగళ్ళు క్లస్టర్ 19 వాలంటీర్ దాసరి సందీప్ కుమార్ తో పాటు మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజిలు కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. వీరికి కర్ణాటకకు చెందిన నడిపిరెడ్డి సహకరిస్తున్నట్లు తేలింది. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసిన అధికారులు కర్ణాటక మద్యం( 480 టెట్రా మద్యం ప్యాకెట్లు), ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వుండాల్సిన వాలంటీర్లు ఇలా అక్రమంగా మద్యం అమ్ముతూ పట్టుబడటం సంచలనంగా మారింది. స్థానిక వైసిపి నాయకుడి అండదండలతోనే వాలంటీర్లు మద్యం విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.




Updated : 8 Sept 2023 10:05 AM IST
Tags:    
Next Story
Share it
Top