Home > ఆంధ్రప్రదేశ్ > అమెరికాలో తెలుగు యువతి మృతి... దర్యాప్తుకు భారత ప్రభుత్వ డిమాండ్...

అమెరికాలో తెలుగు యువతి మృతి... దర్యాప్తుకు భారత ప్రభుత్వ డిమాండ్...

అమెరికాలో తెలుగు యువతి మృతి... దర్యాప్తుకు భారత ప్రభుత్వ డిమాండ్...
X

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతిచెందడంపై పోలీసులు ఎగతాళిగా మాట్లాడుకోవడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉదంతపై లోతైన దర్యాప్తు జరపాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ డిమాండ్ చేసింది. విషాదకరమైన మనిషి మరణంపై చులనకగా మాట్లాడడం సరికాదని మండిపడింది. ఈ అంశంపై అమెరికా ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశామని ట్వీట్ చేసింది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పోలీసు వాహనం ఆమెను వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. కారును కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడిపాడు. డ్రగ్స్ కేసు విచారణ కోసం గంటకు 120 కిలోమీటర్లతో వేగంగా వెళ్తూ జాహ్నవిని ఢీకొట్టాడు. జాహ్నవి కుటుంబానికి 11 వేల డాలర్లను పరిహరం కింద చెల్లిస్తామని పోలీసులు చెప్పారు. దీనిపై సియాటెల్ పోలీసుల సంఘం ఉపాధ్యక్షుడు డేనియల్ ఆడెరర్ చులకనగా నవ్వుతూ మాట్లాడాడు. ‘‘ఆమెకు 26 ఏళ్లే. అలాంటి మామూలు ప్రాణానికి అంత విలువలేదు. సరే, చెక్కు ఇవ్వండి’’ అని అన్నాడు. ఆ మాటలు యూనిఫాంకు తగిలించిన మైక్‌లో రికార్డయ్యాయి. రెగ్యులర్ తనిఖీల్లో ఆ సంగతి బయటిపడింది. జాహ్నవి పీజీ చేయడానికి ఆమెరికా వెళ్లింది. నార్తర్న్ ఈస్టరన్ యూనివర్సిటీకి చెందిన సియాటెల్ క్యాంపస్‌లో చదువుకునేది.



Updated : 14 Sept 2023 9:38 AM IST
Tags:    
Next Story
Share it
Top