Home > ఆంధ్రప్రదేశ్ > మందు బాబులకు.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లైంది.. మానవత్వం లేకుండా..

మందు బాబులకు.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లైంది.. మానవత్వం లేకుండా..

మందు బాబులకు.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లైంది.. మానవత్వం లేకుండా..
X

మద్యం ప్రియులకు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. మందు బాటిల్స్ లోడ్ తో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అవేవీ పట్టించుకోని జనాలు బోల్తా పడ్డ మందు బాటిల్స్ కోసం ఎగబడ్డారు. సరుకంతా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట లో జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు.. ఘటనా స్థలానికి ఎగబడ్డారు. సంచుల్లో మద్యం సీసాలు నింపుకెళ్లాడు. గాయపడ్డ డ్రైవర్.. మద్యం బాటిల్లను ఎత్తుకెళ్లొద్దని ఎంత బ్రతిమిలాడినా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అందినకాడికి పట్టుకొని ఉడాయించారు. ప్రమాదం వల్ల సుమారు రూ.6 లక్షల విలువైన మద్యం సీసాలు జనాలు ఎత్తుకెళ్లారు. మరికొన్ని పగిలిపోయాయి. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






Updated : 16 Aug 2023 8:22 PM IST
Tags:    
Next Story
Share it
Top