Home > ఆంధ్రప్రదేశ్ > గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని

గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని

గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు.. కొడాలి నాని
X

వంగవీటి రాధాకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేయరని మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాధా తన సొంత తమ్ముడిలాంటి వాడని నాని స్పష్టం చేశారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో వచ్చిన గెలుపుల్లో కాపులదే సగభాగమని ఆయన పేర్కొన్నారు. చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని.. టీడీపీ వాళ్లు నేను మాట్లాడిన దాన్ని కట్ పేస్ట్ చేసి వీడియోలు వదిలారని నాని ఆరోపించారు. అవి చూసి జన సైనికులు స్పందిస్తున్నారని.. జీవితంలో ఇప్పటి వరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని కొడాలి నాని స్పష్టం చేశారు.

తాను సోమవారం నాడు మాట్లాడిన మాటల్లో అసలు కాపు అనే పదం కూడా లేదని వివరించారు. మహానాడు, చంద్రబాబు, ఎన్టీఆర్, లోకేష్, బాలయ్య గురించి మాట్లాడితే.. కాపుల ప్రస్తావన ఎందుకొస్తుందని ప్రశ్నించారు. తాను మాట్లాడిన వీడియోను కాపు సోదరులు పరిశీలించాలని కొడాలి నాని సూచించారు. స్క్రాప్‌ అనే పదంలో ముందు వెనుక కట్ చేసి పెట్టారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు

రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామనేది కాదు.. బులెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్‌‌ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి.. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారని కొడాలి నాని చురకలంటించారు. అందరి కోసం పనిచేస్తూ.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Updated : 31 May 2023 4:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top