తిరుమల ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలంటూ రమణ దీక్షితులు సంచలన కామెంట్స్
X
తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారని, పూజ కైంకర్యం జరగటం లేదంటూ రమణ దీక్షితులు (Ramana dikshitulu) చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు (Venugopala Dikshitulu) పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. శ్రీవారి ఆలయంలో మార్పులు చేస్తున్నారంటూ అబద్దాలు చెప్పారన్నారు. ఆలయంలో 10 ఏళ్ల క్రితం అభివృద్ధి పనులు చేశారని.. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. భక్తులు ఎవరు అవాస్తవాలను నమొద్దని కోరారు. ఆలయానికి రాకుండానే రమణ దీక్షితులు, ఆయన కొడుకు జీతం తీసుకుంటున్నారన్నారు. హిందువైన ఈవో ధర్మారెడ్డిని రమణ దీక్షితులు అన్యమతస్థుడుగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు.
"శ్రీవారి ఆలయంలో పూజా విధానం ఆగమోక్తంగా నిర్వహిస్తు వస్తున్నాం . తిరుమలరాయ మండపంలో స్తంబాలు పెట్టారని, గోడలకు చిల్లులు, తవ్వకాలు చేశారనే ఆరోపణలు అవాస్తవం . 10 ఏళ్ల క్రితం రాతి స్తంభాలకు సపోర్ట్‌గా కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో రమణ దీక్షితులే ప్రధాన అర్చకులు. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆలయంలో జరగలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి అవాస్తవాలు వంశ పర్యాంపర్య అర్చకులు చేయడం సబబు కాదు. ఆలయ ఖ్యాతిని దిగజార్చేలా ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. నాలుగేళ్లుగా 80 వేల జీతం తీసుకుంటూ ఆలయానికి రమణ దీక్షుతులు రావడం లేదు. ఆలయంపై ఇలాంటి అపవాదుకు సృష్టించడం చాలా బాధాకరం. గతంలో పింక్ డైమండ్, తవ్వకాలు అంటూ అవాస్తవాలు చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’’ అని అన్నారు.
అంతకుముందు రమణదీక్షితులు పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ అందులో ఆరోపించారు. ఆయన వేషభాషలు చూస్తేనే అర్థమైపోతుందని కామెంట్ చేశారు. అయితే వైరల్ అవుతున్న వీడియోపై రమణ దీక్షితులు స్పందించారు. తాను ఆలయంలో జరిగే కార్యక్రమాలు, టీటీడీ ఈవోపై విమర్శలు చేస్తున్నట్లు చెబుతున్న వీడియో ఫేస్‌బుక్‌లో చూసి షాకయ్యానన్నారు. అసలు తన వాయిస్ కాదని.. తనపై ఇలా చీప్ ట్రిక్స్‌తో తనను టార్గెట్ చేశారని.. ఇలా చేసి తనకు టీటీడీతో ఉన్న సత్సంబంధాలను చెడగొట్టేలా కనిపిస్తోందన్నారు.