Home > ఆంధ్రప్రదేశ్ > Breaking News: చంద్రబాబు కేసు తీర్పు వాయిదా..

Breaking News: చంద్రబాబు కేసు తీర్పు వాయిదా..

Breaking News: చంద్రబాబు కేసు తీర్పు వాయిదా..
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కేసు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. కాగా చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు రోజు రోజుకు వాయిదా పడుతూ వస్తుంది. బుధవారం కస్టడీ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉండగా.. దాన్ని గురువారానికి పోస్ట్ పోన్ చేసింది ఏసీబీ కోర్ట్. అయితే ఇవాళ కోర్టులో ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. దాంతో రేపు ఉదయం జడ్జి వెల్లడించే తీర్పుతో చంద్రబాబు కస్టడీపై క్లారిటీ రానుంది. ఇప్పటికే తీర్ను రావాల్సి ఉండగా.. ఇరువర్గాల లాయర్లు మరోసారి వాదనలు వినిపించారు. బాబును కస్టడీకి ఇవ్వాలని సీబీఐ లాయర్లు గట్టిగా వాదిస్తున్నారు. కేసులో ఆధారాలు లేనప్పుడు కస్టడీ అవసరం లేదని బాబు తరును లాయర్లు వాదిస్తున్నారు. ఈ వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తీర్పు చెప్పనుంది. దీంతో ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు:

రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. రాజకీలయ నేతలు, ఐటీ ఉద్యోగులు, కార్యకర్తలు తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాద’ని వ్యాఖ్యనించారు. గురువారం పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాట్లాడిన గడ్కరీ.. చంద్రబాబు యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.




Updated : 21 Sept 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top