Chandrababu: చంద్రబాబును కోర్టులో హాజరుపర్చండి : జడ్జి
X
ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం నెలకొంది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్కు కోర్టు అనుమతిచ్చింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. శుక్రవారం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు చెప్పింది.
ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. అటు అంగళ్ల ఘటన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. అంగళ్లలో చంద్రబాబు కార్యకర్తలను ఎలా రెచ్చగొట్టాడో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ పోలీసుల తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పెన్ డ్రైవ్లో పలు వీడియోలను కోర్టుకు అందజేశారు. ముందస్తు బెయిల్కు చంద్రబాబునాయుడు అర్హుడు కాదని పోలీసులు వాదించారు.