ACB Court Postponed Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది (ACB Court Postponed Chandrababu Bail Petition) అక్టోబర్ 4న రెండు పిటిషన్లపై తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
అంతకుముందు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంలో కోర్టులో విచారణ వాయిదా పడింది. అక్డోబర్ 3న కేసు విచారణ చేపడతామని సీజేఐ తెలిపారు. తగిన ధర్మాసనానికి పిటిషన్ను బదిలీ చేస్తామన్నారు. ఈ కేసు విచారణ నుంచి తెలుగు న్యాయమూర్తి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో చంద్రబాబు అడ్వకేట్ లూథ్రా పిటిషన్ను సీజేఐ ముందు పిటిషన్ను మెన్షన్ చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. అయితే సీజేఐ చంద్రచూడ్ విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.