Home > ఆంధ్రప్రదేశ్ > చీరల వ్యాపారులపై బెజవాడ వ్యాపారుల దాష్టీకం

చీరల వ్యాపారులపై బెజవాడ వ్యాపారుల దాష్టీకం

చీరల వ్యాపారులపై బెజవాడ వ్యాపారుల దాష్టీకం
X

తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆ ఘటననంతా వీడియోని తీసి.. ఆపై వీడియోలను పలువురికి పంపి వికృత చేష్టలకు పాల్పడ్డారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారు. డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది. కోపంతో ఊగిపోయిన బెజవాడ షాపింగ్ మాల్(ఆలయ సిల్క్స్) వ్యాపారి విచక్షణ మరచి... ఇద్దరు వ్యాపారుల బట్టలు ఊడదీసి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఆ ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశాడు. ఆ వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న బెజవాడ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. బెజవాడ వ్యాపారి ఆగడాలపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు.. ధర్మవరం నుంచి వచ్చిన వ్యాపారులు.. ఆ వస్త్ర దుకాణంలోని మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అందువల్లే ఆ షాపింగ్ మాల్ యజమాని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని సమాచారం. ఆ వీడియోల్లో వారిని వేధిస్తూ.. బూతులు తిడుతూ.. దారుణంగా వేధించారు. బాధితులు దండం పెడుతూ.. తమను విడిచి పెట్టాల్సిందిగా వేడుకుంటున్నారు.

Updated : 6 July 2023 1:54 PM IST
Tags:    
Next Story
Share it
Top