వాళ్లంతా చంద్రబాబు ఊరకుక్కలు.. MP Kesineni Nani
X
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పై విరుచుకుపడ్డారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు కొంత మంది ఊర కుక్కల్ని(టీడీపీ నాయకులు) తనపై ఉసిగొల్పుతున్నాడని దుయ్యబట్టారు. మంగళవారం విజయవాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు దగ్గర ఉన్న కొందరు టిడిపి నేతలు కేవలం పార్టీ నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని అని అన్నారు. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారు. అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసని.. ఇలాంటివాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా? లేదా? అనేది చంద్రబాబు, నారా లోకేష్‌లనే అడగాలన్నారు. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని తాను పట్టించుకోనని చెప్పారు.
ఏపీలో సొంతిళ్లు లేని చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు చివరి ఎన్నికలని, ఓటమి తరువాత సొంత రాష్ట్రమైన తెలంగాణకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ”నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక.. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు” అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు. ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు అని ఆరోపించారు.