Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీలోకి కేశినేని నాని.. ఇవాళ సీఎం జగన్తో భేటీ..!

వైసీపీలోకి కేశినేని నాని.. ఇవాళ సీఎం జగన్తో భేటీ..!

వైసీపీలోకి కేశినేని నాని.. ఇవాళ సీఎం జగన్తో భేటీ..!
X

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల్లో జంపింగ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ఇంచార్జులను మార్చే పనిలో పడింది. దీంతో అసంతృప్త నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని అంశం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాని.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది

ఇప్పటికే నాని కూతురు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవి సహా టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో నాని టీడీపీని వీడడం ఖాయమనే వార్తలు వినిపించాయి. అటు నాని సైతం గుర్తింపు లేని పార్టీలో ఉండలేనని ఇప్పటికే చెప్పారు. ముందు ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనిపై లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. మరోసారి విజయవాడ నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని నాని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ను నాని కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరి భేటీ ఉంటుందని సమాచారం. అటు వైసీపీ సైతం విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తామని నానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు నానితో చర్చలు జరిపారు. జగన్ - నాని భేటీ తర్వాత టికెట్ల అంశంపై మరింత స్పష్టత రానుంది.

Updated : 10 Jan 2024 12:22 PM IST
Tags:    
Next Story
Share it
Top