విశాఖ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
Lenin | 14 Dec 2023 1:25 PM IST
X
X
ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు లేచాయి. తొలి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్‌లో మొదట వ్యాపించిన మంటలు తర్వాత మిగతా అంతస్తులకు పాకాయి. దీంతో రోగులు, వైద్యసిబ్బంది భయంతో కింది అంతస్తుల్లోకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటి అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. కొంతమంది రోగులను నిచ్చెనల సాయంతో కిందికి దించారు. 40 మందిని అంబులెన్స్‌లలో నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated : 14 Dec 2023 1:25 PM IST
Tags: Visakhapatam fire indus hospital fire issue jagadamba center ap capital fire accident indus hospital patients
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire