పవన్ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహియాత్రలో భాగంగా గురువారం జగదాంబ బహిరంగ సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నోటీసులు ఇచ్చారు. నిబంధలకు విరుద్ధంగా సభలో వ్యవహరించారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారాహి యాత్రలో ఇకపై ఇలా వ్యవహరించకూడదని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు పవన్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు ప్రత్యేకమైన అనుమతి అవసరం లేదని జనసేన చెబుతుంటే.. నిర్మాణాల దగ్గరకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. రోడ్డు మార్గంలో అక్కడికి వెళితే అభ్యంతరం లేదని పోలీసులు స్పష్టం చేసినట్టు సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ పర్యటించే రోడ్డులో భారీగా ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించమని..ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉందన్నారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో పవన్ ఒక్కరే వెళ్లాలని పోలీసులు తెలిపారు.