Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ ఎయిర్‎పోర్ట్‎కు కొత్త కష్టాలు

విశాఖ ఎయిర్‎పోర్ట్‎కు కొత్త కష్టాలు

విశాఖ ఎయిర్‎పోర్ట్‎కు కొత్త కష్టాలు
X

విశాఖ ఎయిర్‎పోర్ట్‎కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఎయిర్ పోర్ట్ పరిసరాలు , పర్యావరణం పూర్తి అపరిశుభ్రంగా తయారైంది. రన్ వేలో నీటి నిల్వలు చేరడం, ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో చెత్త డంపింగ్ సమస్యతో పక్షుల తాకిడి రోజు రోజుకు అధికమవుతోంది.ఎయిర్ పోర్ట్ చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉండటం దానికి తోడు వ్యర్థాలు అధికంగా వేస్తుండటంతో వాటి కోసం పక్షులు అధికంగా అక్కడికి వస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు గుర్తించారు. దీంతో పక్షులతో ప్రమాదం పొంచివుందని పైలట్లు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బీచ్ రోడ్‎లోని లేజర్ లైట్స్‎తోనూ పైలట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్ వీరి కంప్లైంట్‎కు సానుకూలంగా స్పందించారు.

విశాఖ ఎయిర్‎పోర్ట్‎, పైలట్ల సమస్యలపైన జిల్లా కలెక్టర్ స్పందించారు. ఎయిర్ ఫీల్డ్ నుండి వైమానిక కార్యక్రలాపాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవడానికి సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ నేవీ, పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిథులతో కలెక్టర్ మల్లికార్జున్ సమావేశమయ్యారు. విమానాశ్రయం చుట్టుపక్కన పరిశుభ్రత పాటించాలని, మాంసం దుఖానాలను తొలగించాలని , పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరద నీరు ఎయిర్‎పోర్ట్‎లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే బీచ్ రోడ్‎లో లేజర్ లైట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు.



Updated : 19 Aug 2023 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top