Home > ఆంధ్రప్రదేశ్ > TTD : తిరుమల భక్తులకు బంపర్ ఆఫర్..వారికి వీఐపీ స్పెషల్ దర్శనం

TTD : తిరుమల భక్తులకు బంపర్ ఆఫర్..వారికి వీఐపీ స్పెషల్ దర్శనం

TTD : తిరుమల భక్తులకు బంపర్ ఆఫర్..వారికి వీఐపీ స్పెషల్ దర్శనం
X

తిరుమల తిరుపతి దేవస్థానం రామకోటి తరహాలో 'గోవింద కోటి' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటితరం యువతలో భక్తి భావాన్ని పెంచేందుకు, సనాతన ధర్మం గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి తెలిపారు. అంతే కాదు 'గోవిందకోటి' రాసిన 25 ఏళ్లలోపు పిల్లలకు, యువతకు, వారి ఫ్యామిలీ మెంబర్స్‎కు తిరుమల కొండపై ఒకసారి శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని అనౌన్స్ చేశారు. అదే విధంగా 10,01,116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని మంగళవారం తొలిసారి సమావేశమైన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ప్రకటించింది.





టీటీడీ చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.." నేటితరం యువతలో భక్తి భావాన్నిపెంచేందుకు 'గోవింద కోటి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 'గోవిందకోటి' రాసిన 25 ఏళ్లలోపు పిల్లలకు, యువతకు, వారి ఫ్యామిలీ మెంబర్స్‎కు తిరుమల కొండపై ఒకసారి శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం. 10,01,116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తాం. తిరుమలలో ఉన్న అతి పురాతనమైన సత్రాలను తొలగించి , వాటి స్థానంలో రూ.600 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో రెండు వసతి భవనాలను నిర్మిస్తాం. ఒకదానికి అచ్యుతం, మరోదానికి శ్రీపథం అనే పేర్లు పెడతాం. ఈ రెండు భవనాల ద్వారా 20 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు.





సనాతన ధర్మం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ఎల్‌కేజీ చదివే విద్యార్థుల నుంచి పీజీ చదివే వారి వరకు సులభంగా అర్థం చేసుకునేలా 20 పేజీల భగవద్గీత సారాన్ని తెలియజేసే కోటి పుస్తకాలను అందిస్తాం. ముంబైలోని బాంద్రాలో రూ.5.35 కోట్లతో టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్, రూ.1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి బోర్డులు సభ్యులు ప్రతిపాదనలు తెలిపారు. వాటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా ధర్మగిరి, కీసరగుట్ట, కోటప్పకొండ, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేదవిజ్ఞానపీఠాల్లో అధ్యాపక పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం. శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణార్థం చేతి కర్రలను బుధవారం నుంచి పంపిణీని చేస్తాం. తిరుమలలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అంక్షలను కొనసాగిస్తాం" అని కరుణాకరరెడ్డి అన్నారు.










Updated : 6 Sept 2023 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top