సత్తెనపల్లిలో కన్నా వర్సెస్ అంబటి..మొదలై మాటల యుద్ధం
X
సత్తెనపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు తీసుకన్న అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చిచింది. జీవీ అంజనేయులు, కోడెల కుమారుడు శివప్రసాద్ రెడ్డిలను కాదని కన్నాను తెరపైకి తీసురావడం చర్చనీయాంశమైంది. ఇక మంత్రి అంబటి పై పోటీ చేసేది కన్నా అని దాదాపుగా తేలడంతో..ఇరువురు మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు కౌంటర్లు, సెటైర్లు విసురుతున్నారు. తాజాగా మరోసారి కన్నా లక్ష్మీనారాయణపై అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, జనసేనలపై తాను విమర్శల చేయడంతో చంద్రబాబు, పవన్ తనను టార్గెట్ చేశారని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో పెద్ద వస్తాదు అని.. నా కంటే కన్నా క్సెస్ రేటు చాలా ఎక్కువని తెలిపారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ మాదిరి తాను పార్టీలు మారలేదని అన్నారు. తాను కాంగ్రెస్‌ను నమ్ముకొని..తర్వాత జగన్ కోసం వైసీపీలోకి వచ్చినట్లు అంబటి వివరించారు. కోడెల కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారని తెలిపారు.
అంబటి వ్యాఖ్యలపై కన్నా కూడా తనదైనశైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పదే పదే వస్తాదు అంటూ అంబటి రాంబాబు పేర్కొనడంపై కన్నా స్పందించారు. ఆయన భాష ఏంటో తనకు అర్థం కావడంలేదని చెప్పారు. అంబటి రాంబాబు 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని, తాను కూడా 1989లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. ఇక ఇద్దరికీ ఏంటి తేడా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కంటే పెద్ద వస్తాదు ఇంకెవరున్నారు? సత్తెనపల్లిని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని కన్నా తెలిపారు.