ఏపీకి చిరంజీవిని సీఎం చేస్తాం..కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
X
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైయింది. ఎలక్షన్ దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. 130 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిరు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఆయన పార్టీ సభ్యత్వం ఉందని ఆయన అన్నారు. మెగాస్టార్‌ని తిరుపతి నుంచి గెలిపించుకుంటామని అన్నారు. ఆ తర్వాత సీఎంని కూడా చేస్తామని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు. ఇక జగన్ ప్రభుత్వంపైనా చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ చర్యల కారణంగానే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైసీపీకి దూరమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నారని అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే స్థాయి ఆయనకు లేదని చింతా మోహన్ ఆరొపించారు.