Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీకి భారీ వర్ష సూచన
X

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిని కుండపోత వర్షాలు అతలాకుతలం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతం లో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో కొన్ని వర్షాల కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది..

Updated : 15 July 2023 10:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top