వేణు స్వామి చెప్పినట్లు చంద్రబాబు జైలుకు
X
ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంచలనం సృష్టింది. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నమాట. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏసీబీ కోర్టులో వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పు రేపటికి వాయిదా పడింది. ఇరువైపు న్యాయవాదులు కేసుపై గట్టిగా వాదిస్తున్నారు. కాగా బాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చర్చల్లోకి వచ్చారు. గతంలో చంద్రబాబుపై మూడేళ్ల క్రితం ఆయన చెప్పిన జోస్యం వీడియో వైరల్ అవుతుంది. అందులో ఏం ఉందంటే..?
‘చంద్రబాబు శాతం కచ్చితంగా సమస్యల బారిన పడతారు. వందకు వంద శాతం జైలు జీవితం గడుపుతారు. 2024 వరకు లోకేష్ కు బ్యాడ్ టైం నడుస్తుంది. టీడీపీ గెలవటం కష్టం. పరిస్థితులు చేయి దాటిపోతాయి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. మూడేళ్ల క్రితం ఆయన చెప్పినట్లు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుపై సెక్షన్ 409 కేసు పెట్టారు సీబీఐ పోలీసులు. ఏసీబీ కోర్టులో విచారణ జరుగగా ఖైదీ నెంబర్ 7691ను కేటాయించి 14 రోజుల రిమాండ్ కు తరలించారు.