Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు రిమాండ్.. నెక్ట్స్ ఏం జరగనుందంటే..?

చంద్రబాబుకు రిమాండ్.. నెక్ట్స్ ఏం జరగనుందంటే..?

చంద్రబాబుకు రిమాండ్.. నెక్ట్స్ ఏం జరగనుందంటే..?
X

చంద్రబాబు ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్లో ఉండనున్నారు. అయితే కోర్టు రిమాండ్ విధించగానే చంద్రబాబు లాయర్లు అలర్టయ్యారు. తీర్పు వెలువడగానే వెంటనే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏసీబీ కోర్టులో సీఐడీ సైతం కస్టడీ పిటిషన్ వేసింది. చంద్రబాబును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరింది. అటు చంద్రబాబు లాయర్లు కోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబును గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని పిటిషన్‌ వేయగా.. ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు అనుమతివ్వాలని మరొక పిటిషన్‌ దాఖలు చేశారు.

అదేవిధంగా ఏసీబీ కోర్టు తీర్పుపై చంద్రబాబు లాయర్లు రేపు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సోమవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని చంద్రబాబు లాయర్లు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చంద్రబాబును తరలిస్తారన్న సమాచారంతో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అలర్ట్ అయ్యారు. జైలు ఆవరణలో భారీగా పోలీసు భద్రతతో పాటు బారికెడ్లు ఏర్పాటు చేశారు. అటు ఏపీ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Updated : 10 Sept 2023 8:31 PM IST
Tags:    
Next Story
Share it
Top