వైసీపీ ఆరో జాబితాలోని అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడంటే?
X
వైసీపీ 4 ఎంపీలు, ఆరు అసెంబ్లీ స్థానాలతో ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు కసరత్తులు చేసిన అధిష్టానం చివరకు కొందరి పేర్లను ప్రకటించారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిగా నాగార్జునరెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీకి బుట్టా రేణుక, గుంటూరు (ఎంపీ) ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పను ఖరారు చేశారు. మొత్తం 4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జుల జాబితాను రిలీజ్ చేశారు.
ఆరో జాబితా జాబితా ఇదే..
రాజమండ్రి (ఎంపీ)-గూడూరు శ్రీనివాస్
నర్సాపురం (ఎంపీ)- అడ్వకేట్ గూడూరి ఉమాబాల
గుంటూరు (ఎంపీ)- ఉమ్మారెడ్డి
చిత్తూరు (ఎంపీ)-రెడ్డప్ప
నెల్లూరు సిటీ (అసెంబ్లీ)-ఎండీ అఖిల్
మైలవరం (అసెంబ్లీ)-సర్నాల తిరుపతిరావు యాదవ్
మార్కాపురం (అసెంబ్లీ)- అన్నా రాంబాబు
జీడీ నెల్లూరు (అసెంబ్లీ)-కె. నారాయణ స్వామి
గిద్దలూరు (అసెంబ్లీ)-నాగార్జునరెడ్డి,
ఎమ్మిగనూరు (అసెంబ్లీ)- బుట్టా రేణుక
కాగా వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తోంది. ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేసింది. మొత్తం 61 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే , 14 ఎంపీ స్థానలకు ఇంచార్జులను ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. వారిని కాదని కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఆరో జాబితాలోనూ కొత్త వారికి కల్పించారు. అయితే విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా, స్వపక్షంలో అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఇంఛార్జుల మార్పును కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. సర్వేలు, సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటూ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్నారు.