RGV : షర్మిలను అలా ఎందుకు పిలుస్తున్నారు.. ఎవరైన చెప్పండి : ఆర్జీవీ
X
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జగన్ను జైలుకు పంపిన పార్టీలో షర్మిల చేరిందంటూ వైసీపీ శ్రేణులు ఆమెను విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో మొరుసుపల్లి షర్మిల అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. షర్మిలను అలా ఎందుకు పిలుస్తున్నారో ఎవరైన చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ను ఇప్పటివరకు 3లక్షల మందికిపైగా చూశారు.
కాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన ఇంటిపేరు మొరుసుపల్లి. అయితే ఆయన క్రైస్తవ మతంలోకి మారి.. మతబోధకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో షర్మిలను అనిల్ ఇంటి పేరైనా.. మొరుసుపల్లితో వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. ఇంకా వైఎస్ ఇంటి పేరు ఎందుకు పెట్టుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.
Can someone please tell me why she is called Morusupalli Sharmila Shasthri ???😳
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2024