Home > ఆంధ్రప్రదేశ్ > భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా?..లక్షిత తల్లి

భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా?..లక్షిత తల్లి

భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా?..లక్షిత తల్లి
X

అలిపిరి మార్గంలో ఓ మృగం దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. రుయా ఆస్పిత్రికి పాప మృతదేహాన్నిటీటీడీ అధికారులు తరలించారు . రుయా ఆస్పత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి. తన కళ్ల ముందే కన్న కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. దేవుడే లేడు.. బండరాయిలా ఉండిపోయాడు అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. అంత దూరం నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తే బిడ్డను కోల్పోయామే అంటూ గుండలు అవిసేలా రోదిస్తోంది ఆ మాతృమూర్తి . ఇందుకోసమేనా ఇక్కడికి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్షిత తల్లి. వన్య మృగాలు వరుసగా దాడి చేస్తుంటే అలిపిరి మెట్ల మార్గాన్ని ఎందుకు మూసేయరు అంటూ ప్రశ్నించింది. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని, తమ చిన్నారి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించింది. టీటీడీ, ఫారెస్ట్ అధికారుల తీరును తప్పుపట్టింది.

నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం తిరుమలకు వెళ్లింది. రాత్రి 8 గంటల సమయంలో వారంతా అలిపిరి నుంచి నడకమార్గంలో కొండపైకి బయలుదేరారు. రాత్రి 11గంటల సమయంలో వారు లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ముందు వెళ్తున్న ఆరేళ్ల వయసున్న లక్షితపై చిరుత దాడి చేసింది. తల్లిదండ్రులు పెద్దగా అరవడంతో పాపను అడవిలోకి ఈడ్చుకుపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. ఉదయం పాప ఆచూకీ కోసం వెతకగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసింది. విగతజీవిగా మారిన బాలికను చూసి పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు.



Updated : 12 Aug 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top