Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ.. భర్త మర్మాంగాలు కోసిన రెండో భార్య

ఏపీ.. భర్త మర్మాంగాలు కోసిన రెండో భార్య

ఏపీ.. భర్త మర్మాంగాలు కోసిన రెండో భార్య
X

కాపురం అన్న తర్వాత చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. కూర్చుని చర్చించుకుని రాజీ పడితే సర్దుకుంటాయి. ఆవేశానికి పోతే రక్తపాతాలే. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో అలాంటి ఘోరమే జరిగింది. తొలి భార్య వీడియోలు పదేపదే చూస్తున్న భర్తకు రెండో భార్య ఘోరమైన శిక్ష విధించింది. రేజర్ బ్లేడుతో అతని మర్మాంగాలను కోసేసింది. బాధితుడు లబోదిబోమంటూ ఆస్పత్రిలో చేరాడు. అయితే తాము కేవలం గొడపడ్డామని, ఇలా అవుతుందని అసలు ఊహించలేదని నిందితురాలు చెబుతోంది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ జరిగిన ఈ దారుణ వివరాలు..

చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలి భార్యతో విభేదాల వల్ల వడిపోయి వరమ్మ అనే మహిళలను నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. అయితే తొలి భార్యను మరచిపోలేక తరచూ ఆమె వీడియోలు చేస్తున్నాడు. ఇది జీర్ణించుకోలని వరమ్మ గొడవలు పడేది. అతడు వినకపోవడంతో మాటామాట పెరిగి భౌతికంగా దాడి చేసుకున్నారు. తను ఊరికే కొట్టానని, గాయాలు చేయలేదని వరమ్మ చెబుతోంది. ఆనంద్ బాబును ప్రాథమిక చికిత్స కోసం నందిగామ ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత మెరుగైన వద్యం కోసం విజయవాడుకు తీసుకెళ్లారు.



Updated : 22 July 2023 2:57 PM IST
Tags:    
Next Story
Share it
Top