Home > ఆంధ్రప్రదేశ్ > ముద్దుపెట్టబోయిన భర్త.. భార్య పనితో ఆస్పత్రికి..

ముద్దుపెట్టబోయిన భర్త.. భార్య పనితో ఆస్పత్రికి..

ముద్దుపెట్టబోయిన భర్త.. భార్య పనితో ఆస్పత్రికి..
X

వారిద్దరు భార్యభర్తలు.. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లిన భర్త తన భార్యకు ముద్దుపెట్టబోయాడు. అప్పుడు ఆమె చేసిన పనికి ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది.

గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెందిన పుష్పవతిని 2015లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తారాచంద్.. తన భార్య దగ్గరకు వెళ్లగానే ఆమె ఒక్కసారిగా.. ఆయన నాలుకను కొరికేసింది.

కొద్దిసేపు అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతడు తేరుకునేలోపే నాలుకకు తీవ్ర గాయమైంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. తన భార్యను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఇలా నాలుక కొరికేసినట్లు అతడు చెప్పుకొచ్చాడు. భార్య ప్రవర్తన కొంతకాలంగా సరిగ్గా లేదని.. అదే ఊరిలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని ఆరోపించాడు.

తన భార్య నుంచి ప్రాణహాని ఉందని తారాచంద్ వాపోయాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. అయితే తన భర్త బలవంతంగా ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడని.. అందుకే నాలుక కొరికేసినట్లు భార్య పుష్పవతి చెప్పాడు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.


Updated : 21 July 2023 1:40 PM IST
Tags:    
Next Story
Share it
Top