Home > ఆంధ్రప్రదేశ్ > Woman Locked Police Station: న్యాయం జరగలేదంటూ.. పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన ఓ మహిళ

Woman Locked Police Station: న్యాయం జరగలేదంటూ.. పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన ఓ మహిళ

Woman Locked Police Station: న్యాయం జరగలేదంటూ.. పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన ఓ మహిళ
X

తన సమస్య పరిష్కరించకుండా పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ... ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం వేసింది. ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి లో ఈ ఘటన వెలుగు చూసింది. న్యాయం కోసం ఐదు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఈ సాహాసానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..

సారిపల్లి పార్వతి అనే మహిళ.. గత 5 ఏండ్లుగా పెందుర్తి కృష్ణానగర్‌లో గ్రీన్ ట్రీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. 2 సంవత్సరాల క్రితం తన ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని నాలుగో ప్లోర్‌లో ప్లాట్ అమ్మేస్తున్నట్లు ప్లాట్ ఓనర్ చెప్పడంతో తానే తీసుకుంటానని 5 లక్షల రుపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుంది. అందులోకి షిఫ్ట్ అయ్యింది. కానీ తాజాగా ఓ ఓనర్ కొడుకు, కోడలు మాత్రం అపార్ట్‌మెంట్ రేటు పెరిగిందని.. ఇప్పుడు అమ్మడం లేదని.. వెంటనే ఖాళీ చేయ్యాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నాయి.

ఈనెల 13వ తేదిన ఫ్లాట్ ఓనర్ కొడుకు.. ఆ ప్లాట్‌లోని సామాన్లు బయటపడేసి, ప్లాట్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా... పార్వతి పెందుర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పార్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించేశారు. అయితే.. మంగళవారం పార్వతి ఫ్లాట్ లో లేని సమయంలో.. ఫ్లాట్ లో ఉన్న ఆమె కూతురిని కూడా బయటకు పంపి.. ప్లాట్‌కు తాళం వేశారు. బయటనుంచి తిరిగొచ్చిన పార్వతి.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. నేరుగా పెందుర్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తాళం వేసింది. తనకు న్యాయం చేయ్యకపోతే ఇక్కడే ధర్నా చేస్తానని చెప్పింది. మహిళా పోలీసులు బుజ్జగించటంతో.. ఎట్టకేళకు తాళం తీసింది. దీంతో.. పెందుర్తి పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకోని సమస్యపై ఆరా తీశారు. ఈ గొడవను కోర్టులో తేల్చుకోవాలని సీఐ ఇంటి ఓనర్‌తో పాటు పార్వతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

Updated : 18 Oct 2023 10:40 AM IST
Tags:    
Next Story
Share it
Top