Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం జిల్లాలో విషాదం..ఏసీ పేలి మహిళ మృతి

ప్రకాశం జిల్లాలో విషాదం..ఏసీ పేలి మహిళ మృతి

ప్రకాశం జిల్లాలో విషాదం..ఏసీ పేలి మహిళ మృతి
X

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఓ ఇంట్లో విషాద ఘటన జరిగింది. అధిక విద్యుత్ వోల్టేజీతో ఏసీ పేలి 52 ఏళ్ల మహిళ మృతి చెందింది. రాత్రి సమయంలో నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఏసీ నుంచి విడుదలైన వాయువులను పీల్చడంతో మహిళ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమెతో పాటే ఉన్న కుమారుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అతడికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.

చీమకుర్తికి చెందిన వెంకట సుబ్బారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ గత నాలుగేళ్ల క్రితం మరణించారు. భర్త మరణంతో కారుణ్య నియామకాల కింది జడ్పీ కార్యాలయంలో పీఎఫ్ విభాగంలో ఉద్యోగాన్ని పొందింది మృతురాలు శ్రీదేవి. కుమారుడు సాయితేజతో కలిసి చీమకుర్తిలోనే ఉంటోంది. రోజూలాగే మే 28న తల్లీ కుమారులిద్దరూ రాత్రి కావడంతో పడుకున్నారు. అయితే అధిక వోల్టేజీతో విద్యుత్ సరఫరా కావడంతో ఏసీలోని తీగలు కాలిపోయి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ క్రమంలో ఏసీ నుంచి పొగలు రావడం, ఆ గాలిని పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించి హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒంగోలు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి శ్రీదేవీ చనిపోయింది. ఆమె కుమారిడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated : 31 May 2023 7:50 AM IST
Tags:    
Next Story
Share it
Top